ఈ తరం భారతం 08.09.2025 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం:
పోక్సో (POCSO) కేసుల్లో నేరస్థులకు తప్పించుకునే అవకాశం లేదని అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా కన్వెర్జెన్సీ సమావేశం పోలీస్ కమిషనర్ కార్యాలయం కాన్ఫిరెన్స్ హాల్లో జరిగింది. ముఖ్యతిధిగా మొదటి అదనపు జిల్లా జడ్జి గౌరవ కె.ఉమాదేవి గారు హాజరై భాదితులకు భరోసా, నష్టపరిహారం, పునరావాసం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి బలమైన చట్టంగా పొక్సో యాక్ట్ రూపొందించబడిందని అన్నారు. ఈ చట్టం కింద నమోదైన నేరాలు బాధితుల మరియు నిందితుల మధ్య రాజీ పడే అవకాశం లేదు కాబట్టి బాధితులు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని అన్నారు.బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులకు కఠిన శిక్షలు పడి బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. POCSO చట్టం కింద లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి గౌరవ న్యాయస్థానం కఠినమైన జైలు శిక్షలు విధిస్తారని, కొన్నిసార్లు జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు. అదేవిదంగా భాదితులకు ప్రభుత్వం భరోసా, నష్టపరిహారం, పునరావాసం, విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు.
సమావేశంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ శ్రీధర్. డీసీపీవో విష్ణువందన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ భారతీరాణి, విద్య శాఖ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, వైద్య శాఖ, భరోసా సెంటర్ అధికారులు పాల్గొన్నారు.















