ఈ తరం భారతం రాజాపేట : సెప్టెంబర్ 8: యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా చందా రమేష్ ఎంపికయ్యారు .ప్రత్యేక ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నారు. రాజపేట మండల ఎంఈఓ చందా రమేష్ ను సోమవారం పలువురు సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో రాజపేట మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, ఐ ఈ ఆర్ టి, సి ఆర్ పి లు, శాలువాశాలువా, బొకే, ప్రత్యేక జ్ఞాపకతో సత్కరించారు. అందరి సహకారంతోనే అవార్డు దక్కిందని, అవార్డు మరింత బాధ్యతను పెంచిందని, జిల్లా అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.















