ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 9 : పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్న కేసీఆర్ .తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలు చేసి, తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన కవులు రచయితలకు కాళోజీ పేరుతో పురస్కారాన్ని అందిస్తూ గౌరవించుకునే గొప్ప సంప్రదాయాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని.. వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తన పుట్టక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ అన్నారు.















