EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జీవనకాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధర.. పసిడి ప్రియులు ఆందోళన

హైదరాబాద్ సెప్టెంబర్ 9 (ఈ తరం భారతం);: బంగారం కొనాలంటే ఇక మధ్యతరగతి కుటుంబాలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలనే ఆలోచనే చాలామంది చేయడం లేదు. తాజాగా బంగారం రికార్డు సృష్టించింది. 10 గ్రాముల పసిడి మరింత ప్రియమైంది. 10 గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ.5,080లు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1.12 లక్షలకు చేరుకుంది. బంగారం ధర ఈస్థాయికి చేరుకోవడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top