EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వాట్సాప్ గ్రూప్‌లో అలర్ట్ – గంటన్నరలోనే దొరికిన దొంగ

ఈ తరం భారతం హైదరాబాద్ (భాగ్యనగరం) సెప్టెంబర్ 9:

వాట్సాప్ గ్రూప్‌లో అలర్ట్ – గంటన్నరలోనే దొరికిన దొంగ.ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో చోరీ.విషయాన్ని వాట్సాప్ గ్రూప్లో తెలిపిన బాధితుడు.గంటన్నర వ్యవధిలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుపడిన నిందితుడు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘటన.

వాట్సాప్ను సాధారణంగా మెసేజ్లు పంపడానికి, సమాచారాన్ని స్నేహితులతో పంచుకోవడానికి వినియోగిస్తాం. అయితే అదే వాట్సాప్తో ఏకంగా ఓ చోరీ కేసును గంటల వ్యవధిలోనే కొందరు గ్రూపు సభ్యులు ఛేదించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.రోజూ మాదిరిగానే ఇంటి ముందు ఆటోను పార్క్ చేసి పొద్దున్న లేచి చూడగా కనిపించలేదు. దీంతో ఆ ఆటో యజమాని ఈ విషయాన్ని తన స్నేహితులకు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేశాడు. వారు ఇదే విషయాన్ని మరికొన్ని గ్రూపులకు షేర్ చేశారు. దీంతో గంటన్నర కాల వ్యవధిలోనే నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్లోని బొల్లారంలో చోటుచేసుకుంది.

ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో :

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్‌కు చెందిన బిపిన్‌రాజ్ యాదవ్ హైదరాబాద్లోని బొల్లారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి తన ఇంటి ముందు ఆటో పార్క్ చేశాడు. అయితే తరువాత రోజు ఉదయం బయటికి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. సమీపంలోని సీసీ కెమేరా ఫుటేజీలను బిపిన్ పరిశీలించాడు. దానిలో రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఆటోను తీసుకెళ్తున్నట్లు గుర్తించాడు.

సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా :

వెంటనే తన ఆటో ఫొటోలను, సీసీ కెమెరా ఫుటేజీని ‘ఝార్ఖండ్ ఏక్తా సమాజ్’ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు. ఆ గ్రూపులోని సభ్యులు ఈ సమాచారాన్ని ఇతర గ్రూపులకూ షేర్ చేశారు. దీంతో ఉదయం 11.30 సమయంలో బంజారాహిల్స్ రోడ్డునెంబర్-10 స్టార్ ఆసుపత్రి సమీపంలో ఝార్ఖ్ండ్ వాసి కల్లుకుమార్ తన ఆటోను పార్క్ చేస్తుండగా పక్కనే చోరీకి గురైన ఆటో కనిపించింది. అయితే ఆ ఆటోను ఎవ్వరూ గుర్తు పట్టకూడదని ఓ వ్యక్తి స్టిక్కర్లు తొలగిస్తూ కనిపించాడు. ఈ ఘటనను తన ఫోన్లో వీడియో తీసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు.

దీంతో ఆ గ్రూపు లోని సభ్యులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారు నిందితుడిని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని విచారించగా అతడు జీడిమెట్ల రోడ్డామినిస్ట్రీ కాలనీకి చెందిన రోహిత్ అని తెలిసింది. చోరీ చేసిన ఆటోను తన స్నేహితుడు రఘురామ్కు ఇవ్వగా, అతడు తన బంధువులను తీసుకెళ్లే క్రమంలో బంజారాహిల్స్లోనే పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

దొంగలను కూడా సులభంగా పట్టుకోవచ్చు:

సోషల్ మీడియాను సరదాలకే కాదు తలచుకుంటే దొంగలను కూడా సులభంగా పట్టుకోవచ్చని ఈ వాట్సాప్ గ్రూపు సభ్యులు నిరూపించారు. ఒక సాధారణ వాట్సాప్ గ్రూప్ మెసేజ్ అలర్ట్తో గంటల వ్యవధిలోనే ఆటోను, నిందితుడిని పట్టుకుని కేసు ఛేదించినందుకు బంజారాహిల్స్ పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఇంత జాగరూకతతో వ్యవహరించిన ఈ వాట్సాప్ గ్రూపు సభ్యులను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు…

Related News

Select the Topic
Scroll to Top