EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది మరియు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 79 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించిన యశోద హాస్పిటల్స్ పల్మోనాలజీ బృందం

10.09.2025 Eetaram bharatham Regional network incharge, Madhusri Nalubola.

ఖమ్మం : శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది (గ్రేడ్ IV MMRC), పొడి దగ్గు, శరీర నొప్పులు మరియు కరోనరీ ఆర్టరీ వ్యాధి, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, రక్తపోటు మరియు బ్రోన్సియల్ ఆస్తమాతో సహా వివిధ అనారోగ్యాలతో అడ్మిట్ అయిన 79 ఏళ్ల మహిళ శ్రీమతి జానికమ్మ మేదరపుకు యశోద హాస్పిటల్స్ పల్మోనాలజీ బృందం విజయవంతంగా చికిత్స అందించింది.

హాస్పిటల్ లో జాయిన్ అయిన అప్పటికి, పేషేంట్ పరిస్థితి క్లిష్టంగా ఉంది. అధిక రక్తపోటు, కీటోన్లతో రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రంగా మరియు హైపోకలేమియా సమస్యలు ఉన్నాయి. 2D ఎకో, ABG మరియు CT థొరాక్స్ సహా అవసరమైన పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల పైభాగం మరియు నోడ్యులర్ పరేన్అమల్ అస్పష్టత రెండింటిలోనూ తేలికపాటి సెంట్రలోబ్యులర్ ఎంఫిసెమాటస్ మార్పులను ఇన్సెక్టివ్ కారణాన్ని సూచిస్తున్నట్లు వెల్లడించాయి.ఆమెకు అధునాతన పల్మనరీ మరియు కార్డియాక్ కేర్ అందించబడింది, ఇందులో IV యాంటీబయాటిక్స్, నెబ్యులైజేషన్, నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్, హైపర్ టెన్షన్ కోసం NTG ఇన్ఫ్యూషన్, ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్ మరియు పొటాషియం కరెక్షన్ ఉన్నాయి. పల్మనాలజీ, కార్డియాలజీ మరియు ఇంటర్నల్ మెడిసిన్ బృందాల నుండి మల్టీడిసిప్లినరీ మద్దతుతో, పేషేంట్ స్థిరమైన మెరుగుదల చూపించారు మరియు ప్రస్తుతం క్లీనికల్గా స్థిరమైన, ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్ట్ అయ్యారు.

యశోద హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్ బి మాట్లాడుతూ, “పేషేంట్ ఒకేసారి వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నందున ఈ కేసు సంక్లిష్టమైనది. సకాలంలో చికిత్స అందించడం, అధునాతన పల్మనరీ కేర్ మరియు కార్డియాలజీ మరియు ఇంటర్నల్ మెడిసిన్తో సహకార ప్రయత్నాల ద్వారా, మేము ఆమె పరిస్థితిని స్థిరీకరించగలిగాము. తీవ్రమైన అనారోగ్యం ఉన్న పేషేంట్లకు చికిత్స అందించడంలో బహుళ విభాగ విధానం  ప్రాముఖ్యత ఈ పేషేంట్ కోలుకోవడం ద్వారా తెలుస్తుంది .”అని చెప్పారు

యశోద హాస్పిటల్స్ గురించి :

గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు (సికింద్రాబాద్, సోమాజిగూడ మరియు మలక్పట్, హైటెక్ సిటీ) 4 వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే, అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు. చురుకైన నాయకత్వం మరియు బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది. అరుదైన మరియు సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ మరియు సట్ స్పెషాలిటీలో అధునాతన రోగనిర్ధారణ మరియు చికిత్సా సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం మరియు అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో 4000 పడకల సామర్ధ్యంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది .

Related News

Select the Topic
Scroll to Top