ఈతరం భారతం సెప్టెంబర్ 10 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఐడియా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి . రాష్ట్ర ఐ వి ఎఫ్ ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం శ్రీనివాస్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం నాయకులు పసుపునూరి వీరేశం,సముద్రాల సత్యం, చోలేటి ప్రకాష్, గందె అంజయ్య,పవర్ శీను, గార్లపాటి శ్రీనివాస్,నాగబాండి జగదీష్, అయిత వెంకటేష్, పొద్దుటూరి ఉపేందర్,మంచన మల్లేష్, మురారి శెట్టి అశోక్ తదితరులు హాజరై అభినందనలు అందజేశారు.















