ఈతరం భారతం సెప్టెంబర్ 10 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు మండల స్థాయి ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం- 2025 ను పొందిన టీఎస్ యుటిఎఫ్ సభ్యుడు జె పరమేశ్వర రావును ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యార్థులకు పరమేశ్వరరావు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వై వెంకట్, ఎండి సయ్యద్, కార్యవర్గ సభ్యులు జూకంటి అంజయ్య, సత్యానందం, కుమారస్వామి,వెంకటేష్, రాపోలు మధుసూదన్, సిద్దేశ్వర్, ఉపాధ్యాయులు ఎం శ్రీధర్,కేసి వెంకటేష్, టిఏపీ ఆర్ పిఏ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు హాజరయ్యారు.















