EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

ఈ తరం భారతం సెప్టెంబర్ 11 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు మండలం నుండి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2025 సంవత్సరానికి గాను అవార్డులు పొందిన కోట శ్రీనివాస్, సంజీవరెడ్డి లను మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. విద్యా రంగానికి వారిద్దరు చేస్తున్న అమూల్యమైన సేవలకు గుర్తింపుగా జిల్లాస్థాయి అవార్డులు దక్కాయి.

ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంఈఓ ఎర్ర లక్ష్మి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్, వెంకటయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గడసంతల మధుసూదన్, మాదాని జోసెఫ్, వెంకటేష్ యాదవ్, ఎండి సయ్యద్, బూడిద శ్రీనివాస్ , స్వామి, వెంకటరెడ్డి, బొమ్మకంటి బాలరాజు, ఎమ్మార్సీ సిబ్బంది రాధిక, చైతన్య, తిరుపతి, శ్రీనివాస్, బాబా, మండల పరిధిలోని ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top