హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఈతరం భారతం) పొరుగు దేశమైన నేపాల్ లో జెడ్ జనరేషన్ యువత చేపట్టిన ఆందోళనలు,నిరసనలో 20 మంది మరణించడం పట్ల సిపిఐ ( ఎమ్ ఎల్) సీ పీ రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,తమ సమస్యలు,ఆకాంక్షలను పరిష్కరించడంలో వరుసగా ప్రభుత్వలు విఫలం అవుతున్న నేపధ్యంలో ప్రజా లో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నిరాశ,నిస్పృహ ల నుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఈ నిరసనలు ప్రతిబిబిస్తున్న, నిరుద్యోగం, యువతకు కొరవడు తున్న ఉపాధి అవకాశాలు ప్రధానంగా జెన్ జెడ్ నిరసనలకు కారణాలుగా ఉన్నాయి,సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్క సారిగా ఈ నిరసనలు తలెత్తే యీ కే,పీ, ఓ లీ ప్రభుత్వం రాజనామ చేయడంతో శాంతి,సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగించాలి ప్రముఖ రాజకీయ నేతల పై మూక హింస పెచ్చరిల్లిన తరుణంలో ఈ చర్యలు మరింత అవుసరం, ముక్యంగా మాజీ ప్రధాని జలనాద్ ఖానల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకారర్క్ ను హతమార్చడం అన్నది ఖండించదగ్గ చర్య అని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది,నేపాల్ యువతకు గల ఆందోళనలు, వారి పిర్యాదులను తక్షణమే వినవాల్సిన అవుసరం ఎంతైనా ఉంది.వాటిని పరిష్కరించేందుకు వెంటనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి.అదే సమయంలో,నేపాల్ రాజరికానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం.ఎంతో కటినంగా సాగినా పోరాటాల అనంతరం సాధించుకున్న రాజ్యంగంలో పొందపర్చిన, ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలను పరిరక్షించుకోవడానికి జాగ్రతలు తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులను రాచరిక వదులు,ఇతర ప్రతి ఘాత శక్తులు అవకాశంగా తీసుకొని దుర్వినియోగం చేయకుండా దేశంలో నీ యువవత. ప్రజాస్వామ్య శక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ సామూహిక నిరసనలు, ఆందోళనల ఫలితం ప్రజాస్వామ్య పునరుద్ధంగా ఉండాలి తపితే పౌడల్ నిరంకుశవధ పాలనను పునరించరాదనిసీపీఐ (ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది















