హైద్రాబాద్ సెప్టెంబర్ 11(ఈ తరంభారతం ) తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఈ నెల 5,6,7 తేదీ ల లో ఆరవ తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ సబ్ జూనియర్ జూనియర్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది అందులో 500 మంది పైగా యోగ విద్యార్థి విద్యార్థులు 26 జిల్లాల నుండి పాల్గొనడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా నుండి ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ జ్యోతిర్మయి సూత్ర సాధించడం జరిగింది వారి కోచ్ మోహన్ సూత్ర ఏ ఐ ప్రహర్ష ఒక సిల్వర్ సాధించడం జరిగింది వారి కోచ్ స్నేహ శ్రీ చరిత మెరిట్ సాధించడం జరిగింది వారి కోచ్ రసజ్ఞ ఎం రోహిత్ సాయిబాబా వారి కోచ్ భార్గవ్ సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ చూసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు గారు ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ జాయింట్ సెక్రెటరీ యోగ రామ్ రెడ్డి టెక్నికల్ కార్యదర్శి తోట సతీష్ గారు యోగ క్రీడాకారులను అభినందించారు. హైదరాబాద్ జిల్లా టెక్నికల్ సంయుక్త కార్యదర్శి స్నేహ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, రంగారెడ్డి జిల్లా, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సాంకేతిక సంయుక్త కార్యదర్శి స్వప్న. జడ్జిలు పూరెల్లి సంతోష్ రెడ్డి పాల్గొన్నారని హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆర్యన్ ఒక ప్రకటనలో తెలిపారు.















