హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈతరం భారతం);: తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుకోలేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జూపల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నేను గెలుస్తనో లేదో నాకే తెల్వదు. పోని నేను గెలిసిన మా పార్టీ గెలుస్తదో గెలవదో తెలియదు.. పోని మా ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. పోని మా ప్రభుత్వం వచ్చిన ఈ స్కీమ్స్ ఇస్తదో లేదో తెల్వదు. నా జేబుల నుంచి ఇచ్చేటివి ఏమైనా ఉంటే ఇస్తా అని చెప్తా. మరి ఎవరో వచ్చేదానికి.. ఏమైతదో తెలవని దానికి అది మోసపు మాట అయితది కాబట్టి హామీ ఇవ్వను. ఇప్పుడు కూడా మీరు అడిగిన వాటన్నింటికి ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.















