EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శాలిగౌరారం వల్లాలలో అమరవీరుల స్మారక స్తూపం ఆవిష్కరణ

తుంగతుర్తి సెప్టెంబర్ 12 (ఈతరంభారతం)నల్లగొండ జిల్లా(నీలగిరి) శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 10 మంది అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన స్తూపాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. 1948లో స్వాతంత్ర సమరంలో వీరమరణం పొందిన 10 మంది అమరవీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి విశ్వనాథ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల స్యాముల్, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top