EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సెప్టెంబర్ 17 నుండి దేశ వ్యాప్తంగా “సేవా పక్షం అభియాన్”     ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈ తరం భారతం);సెప్టెంబర్ 17 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా నిర్వహించబోయే “సేవా పక్షం అభియాన్” దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదేవిధంగా మన తెలంగాణలో కూడా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం.15 రోజుల పాటు నిర్వహించే సేవా పక్వాడ్ కార్యక్రమం సమాజం పట్ల మన బాధ్యతను “సేవ” యొక్క ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు సామాజిక సేవ దృక్పథాన్ని పెంపొందించడంలో మార్గనిర్దేశం చేస్తుంది.వికసిత్ భారత్ 2047 – లక్ష్యంప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, దేశంలోని రైతులు, వ్యాపారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, ఇలా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2047 వరకు భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ ఎకానమీగా తీర్చిదిద్దడంతో పాటు సూపర్ పవర్ గా నిలిపేలా కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి, పేద, రైతు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది.GSTలో 28% నుంచి 18%, 18% నుంచి 5%, 12% నుంచి 5%, 18% నుంచి 0% వరకు భారీ తగ్గింపులు చేసింది. వికసిత్ భారత్ – 15 డేస్ సెలబ్రేషన్స్ ముఖ్య కార్యక్రమాలు :

సెప్టెంబరు 17వ తేదీన బిజెవైఎం ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్/బ్లాక్ లెవెల్‌లో రక్తదాన శిబిరం- ప్రతి కేంద్రంలో కనీసం 75 మంది పాల్గొనాలి.

సెప్టెంబరు 18 వ తేదీన మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్కూల్స్, విద్యా సంస్థలు, కమ్యూనిటీ సెంటర్స్ లో వికసిత్ భారత్ + స్వచ్ఛ భారత్ కాంపిటీషన్స్.

సెప్టెంబరు 21వ తేదీన బిజెవైఎం ఆధ్వర్యంలో మారథాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది.

హైదరాబాదులో గచ్చిబౌలి ఏరియాలో 15,000–20,000 యువత పాల్గొనగలరు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కోఆర్డినేట్; పార్టిసిపెంట్స్‌కు టీ-షర్ట్ & సర్టిఫికెట్ (ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతో) అందించబడుతుంది.

ధీన్ దయాళ్ జీ జయంతి సందర్భంగా సెప్టెంబరు 25వ తేదీన మొక్కలు నాటడం – బూత్/బ్లాక్/డిస్ట్రిక్ట్/స్టేట్ లెవెల్‌లో ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటాలి.

సెప్టెంబరు 26వ తేదీన బిజెపి ఎస్సీ, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో దివ్యాంగులను ఐడెంటిఫై చేసి సన్మానం చేయడం.

సెప్టెంబరు 28వ తేదీన విశిష్ట పౌరులు (పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందినవారు, యూనివర్సిటీ ఛాన్సలర్స్, పబ్లిక్ సర్వీస్ లో సేవలందించిన పెద్దలు) ను సన్మానం చేయడం.

అక్టోబరు 2వ తేదీన మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు గ్రామాల్లో తయారు చేసిన కాటన్ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భరత్ ను సాధించే దిశగా చైతన్యం కల్పించడం.

ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.“సేవా పక్షం అభియాన్” సందర్భంగా ఈ 15 రోజుల పాటు ప్రజలకు అభివృద్ధి, సామాజిక సేవ, ఆత్మనిర్భరత, ఎన్విరాన్మెంట్ కేర్, యువత భాగస్వామ్యం అయ్యేలా వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.

 

Related News

Select the Topic
Scroll to Top