EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హ్యూమన్ ట్రాఫికింగ్ & బాండెడ్ లేబర్ సమస్యలపై మీడియా వర్క్‌ షాప్

ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 12 :తెలంగాణ మీడియా అకాడమీ , ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) సంయుక్తంగా సెప్టెంబర్ 16, 2025 మంగళవారం ఉదయం 10:00 గంటలకు “హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బాండెడ్ లేబర్” అంశాలపై ప్రత్యేక మీడియా వర్క్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం మీడియా ప్రతినిధులకు అవగాహన పెంపొందించేలా, ఈ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవడం, బాధితుల పట్ల ప్రదర్శించే వైఖరి లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.

ఈ వర్క్‌ షాప్‌లో “హ్యూమన్ ట్రాఫికింగ్ & బాండెడ్ లేబర్” బాధితుల పునరావాసం, న్యాయపరమైన, సమాజపరమైన మద్దతు అంశాలపై నిపుణులు ప్రసంగించనున్నారు. అలాగే, మీడియా పాత్ర, బాధితుల గౌరవాన్ని కాపాడుతూ సమగ్ర కథనాలను తయారు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి.

సివిల్ సొసైటీ ప్రతినిధులు, న్యాయ నిపుణులు, అనుభవజ్ఞులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ వేదిక జర్నలిస్టులు, ఎడిటోరియల్ టీంలకు అత్యంత ఉపయోగకరంగా ఉండనుంది.

తెలంగాణ మీడియా అకాడమీ ఈ సమస్యపై జర్నలిజానికి అవసరమైన అవగాహనను పెంచే లక్ష్యంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ వస్తోంది. IJM సంస్థ ఈ రంగంలో దేశవ్యాప్తంగా చేసిన అవిశ్రాంత సేవను మనందరికీ పరిచయం చేస్తూ, న్యాయ వ్యవస్థతో కలిసి పని చేస్తోంది.

ఈ వర్క్‌ షాప్‌లో పాల్గొనదలచిన మీడియా ప్రతినిధులు తేది:15.09.2025 మధ్యాహ్నం 1-00 గంట వరకు తమ పేరు, సంస్థ పేరు, హోదా మరియు పని చేస్తున్న ప్రదేశంతోపాటు తమ మొబైల్ నెంబర్ ను ఈ కార్యాలయ మేనేజర్ సెల్ నెంబర్ 7093600977 కు వాట్సాప్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా నమోదు చేసుకున్న మొదటి 70 మంది జర్నలిస్టులకు మాత్రమే ఈ వర్క్ షాప్ లో పాల్గొనుటకు అనుమతిస్తారు.

Related News

Select the Topic
Scroll to Top