EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాయిరాం ఆసుపత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఖండిస్తున్నాం : డాక్టర్ జంగాల సునీల్ కుమార్

ఈతరం భారతం సెప్టెంబర్ 12 :Khammam bureo Eetaram bharatham Regional network incharge Madhusri Nalubola.

జంగాల రాజేశ్వర్ రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ తో గత 8 సంవత్సరాలుగా హెపటైటిస్-బి టీకా ఉచితంగా అందరికీ అందిస్తున్నారు.ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాయిరాం ఆసుపత్రి అధినేత డాక్టర్ జంగాల సునీల్ కుమార్ మాట్లాడుతూ మా ఆసుపత్రి గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పును ఖండిస్తున్నామని తెలిపారు. ఇటీవల మా ఆసుపత్రిలో చికిత్స పొందిన 13 ఏళ్ల బాలుడు కాలేయం క్షీణత (సిరోసిస్) వ్యాధి సమస్యలతో ప్రాణాపాయస్థితిలో ఉండి మా ఆసుపత్రికి తీసుకురాగా, గ్యారంటీ లేదు, గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరవమని చెప్పాము, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మీ హాస్పిటల్ లో చేర్చుకొమ్మని ప్రాధేయ పడితే వైద్యం చేయడానికి అంగీకరించాను.ఆ బాలుడు ముందుగా పసర నాటువైద్య మందులు వాడినట్లు, అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కాలేయ పరీక్షలు బయాప్సీ చేయించుకున్నట్లు తెలిపారు. అక్కడ ఆయనకు కాలేయ మార్పిడి చేయాలని సూచించారని, ఆ తర్వాత మళ్లీ పసర నాటువైద్యం వాడటంతో మూత్రపిండాల వైఫల్యం, కాలేయం పనితీరు దెబ్బతిని మెదడుకు ప్రభావం చూపే వ్యాధి ఎన్సెఫలోపతి సమస్యలు తలెత్తాయని వివరించారు.తీవ్రప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ బాలుడిని నాలుగు రోజులు ఆలయంలో ఉంచారు,తర్వాతే మా సాయిరాం ఆసుపత్రికి తీసుకువచ్చారని,ఆయన పరిస్థితి అప్పటికే అత్యంత విషమంగా ఆరోగ్యం ఉందని తెలిపారు. రోగి పరిస్థితి గురించి ఆయన బంధువులకు స్పష్టంగా వివరించి,పేషెంట్ బంధువులు, తల్లిదండ్రుల అంగీకారంతోనే చికిత్స అందించామని అన్నారు.వైద్యం అందించే సమయంలో రోగి బంధువులను కూడా నేరుగా చికిత్స విభాగంలోకి అనుమతించి, రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించామని,రోగి చేతులు కాళ్లు కదుపుతున్న దృశ్యాలను వీడియోలను మీడియాకు చూపించారు.ఈ విషయంపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో అనవసరమైన అపోహలు కలుగుతున్నాయని, మా ఆసుపత్రి ఎల్లప్పుడూ ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్య నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా,నమ్మకమైన వైద్య సేవలు అందిస్తోందని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్,డాక్టర్ బోల్లికొండ శ్రీనివాసరావు , డాక్టర్ జంగాల స్వాతి. డాక్టర్ సురీందర్ రెడ్డి డాక్టర్ నారాయణ, డాక్టర్ రవి,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top