ఈతరంభారతం హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై ఆలేరు ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను కలిసి చర్చించారు. మర్యాద పూర్వకంగా ఆయన మంత్రిని కలిసినప్పుడు ఈ చర్చ జరిగింది.ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తో కలిసి ఆయన రిలీజ్ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులపై కొద్ది సేపు చర్చించారు.















