EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్ రేపు (సెప్టెంబర్ 14) సిటీలోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 13 :హైదరాబాద్ సిటీ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా 2025, సెప్టెంబర్ 14 ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల దృష్ట్యా ఫలక్నుమా, ఇంజన్ బౌలి, నాగుల్చింత ఎక్స్ రోడ్, హిమ్మత్పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మొహల్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా జంక్షన్, పట్టరఘట్టి, ఎస్ జె. హవేలీ, మిరల్ మండి, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫాజల్ గంజ్ T జంక్షన్, ఉస్మాన్ గంజ్, MJ మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి T జంక్షన్, హజ్ హౌస్, AR పెట్రోల్ పంప్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పారు హైదరాబాద్ పోలీసులు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అభ్యర్థించారు.

ఆదివారం (సెప్టెంబర్ 14) చార్మినార్ బంద్:

మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు కారణంగా సెప్టెంబర్ 14 ఆదివారం ఓల్డ్ సిటీలోని పర్యాటక ప్రదేశాలు మూసివేయనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు. చార్మినార్తో పాటు ఓల్డ్ సిటీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలు క్లోజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2025, సెప్టెంబర్ 6న హైదరాబాద్లో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా చార్మినార్ ను మూసివేసిన విషయం తెలిసిందే.

Related News

Select the Topic
Scroll to Top