EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాయితేజ జన్మదినోత్సవ వేళ బీబీనగర్ ఎయిమ్స్ వద్ద  పండ్లు,బ్రెడ్ పంపిణీ

ఈ తరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 14 : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ధార్మిక పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుమారుడు సాయి తేజ జన్మదినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజయ్య స్వామి మాట్లాడుతూ సాయి తేజ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని,రేణుకా మాత ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ వాణిజ్య విభాగం జిల్లా చైర్మన్ కుకటపు చంద్రశేఖర్,భువనగిరి ఐ వి ఎఫ్ పట్టణ కార్యదర్శి జగదాంబ శ్రీనివాస్, ఐవిఎఫ్ జిల్లా నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్,ఉప్పుగళ్ల నరసింహులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top