EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ లక్ష్మీ నృసింహుని సేవలో కియోస్కులు  ఆలయ సేవల ఆధునీకరణలో ముందడుగు: ఈఓ వెంకట్రావు  దర్శనం, ప్రసాదాలు, సేవలు, వ్రతాల టిక్కెట్లు సులభతరం 

ఈతరం భారతం యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో శనివారం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆరు కొత్త కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు పది లక్షలు విలువతో యంత్రాలను భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ తమ సేవా కార్యక్రమంలో భాగంగా విరాళంగా అందించింది.ఈ కియోస్క్ యంత్రాలను భక్తులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు .మూడు యూనిట్లు – ప్రసాదం విభాగంలో…ఒక యూనిట్ – చౌల్ట్రీస్ లో..ఒక యూనిట్ – డోనార్ సెల్ వద్ద ఒక యూనిట్ – వ్రత మండపంలో ఏర్పాటు చేస్తున్నారు.ఈ స్వీయ సేవా కియోస్క్ యంత్రాల యందు భక్తులు తమ అవసరమగు టికెట్లను క్యాష్లెస్ అనగా డిజిటల్ పేమెంట్ ద్వారా పొందవచ్చుఈ స్వీయ సేవా కియోస్క్ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శన టిక్కెట్లు, సేవలు, ప్రసాదాలు, వ్రతాలు మరియు ఇతర అనేక సేవలను పొందవచ్చు. దీని ద్వారా భక్తులు పెద్ద క్యూలలో నిలబడకుండా, సమయాలపై స్పష్టమైన సమాచారంతో , కౌంటర్ల వద్ద ఆలస్యం లేకుండా వెంటనే బుకింగ్ చేసుకోనుటకు,వేగవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉంటుంది .ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వెంకట్రావు మాట్లాడుతూ కియోస్క్ యంత్రాల ప్రవేశపెట్టడం ద్వారా ఆలయ సేవల్లో ఆధునికీకరణ దిశగా ఒక కీలకమైన ముందడుగు వేసిందని, ఇవి భక్తుల అమూల్యమైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడంలో సహకరిస్తాయనీ, దీంతో భక్తులకు మరింత ఆనందదాయకం, పారదర్శకతతో కూడిన, ఇబ్బందులేని ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యాల అభివృద్ధి కోసం చేసిన ఈ గొప్ప సహకారానికి కెనరా బ్యాంక్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top