EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దయనీయ స్థితిలో శ్రీ నృసింహుని సంస్కృత పాఠశాల తులసి కాటేజీ వద్ద పాఠశాల మార్చడం బెటర్  దేవస్థానం ఈవోకు సిపిఐ ప్రతినిధి బృందం వినతి 

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);: సిపిఐ ప్రతినిధి బృందం ఆదివారం కొండ కింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత పాఠశాల,శిల్ప కళాశాల భవనం పరిశీలించింది . సంస్కృత పాఠశాల భవనం గతంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నప్పుడు సుమారు 30 సంవత్సరాల క్రితం అదనపు తరగతి గదుల కోసం నిర్మాణం చేసింది. ప్రస్తుతం ఆ భవనం పూర్తిగా వర్షం నీరు కిటికీల ద్వారా క్లాస్ గదు లలో, అదే విధంగా స్లాబ్ నుండి క్లాస్ రూమ్ గదిలోకి నీరు రావడం జరుగుతుంది. దాని వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మొత్తం ఎనిమిది గదులు ఉన్న ఈ భవనంలో శిల్పకళా కళాశాల కోసం మూడు గదులు కేటాయించారు .అందులో ఒకటి పూర్తిగా స్లాబ్ ద్వారా నీరు కారి కూలిపోయే పరిస్థితిలో ఉన్నది.మిగిలిన 5 గదుల లో సంస్కృత పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి వంటగది, రెండోది భోజనశాల, మూడోది ఆఫీసుకు కేటాయించగా… కేవలం రెండు గదులలో 75 మంది విద్యార్థులు చదువుకోవడం, అదే గదిలో బస చేయడం జరుగుతుంది. గదులు సరిపోక …చాలామంది విద్యార్థులు హాల్లో వర్షం పడుతున్న చుట్టూ కవర్లు, పరదాలు కట్టుకొని నిద్రిస్తున్నారు. విద్యార్థులు జాగ్రత్తల కోసం రాత్రి సమయంలో టీచర్లు, హాస్టల్ వార్డెన్ లేకపోవడం వలన ఒక హోంగార్డును భద్రత కోసం ఏర్పాటు చేశారు.. భద్రాచలం, పాలకుర్తి, మక్తల్, గద్వాల్, హనుమకొండ తదితర సుదీర్ఘ ప్రాంతాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సన్నిధిలో విద్యను అభ్యసించడానికి పేద కుటుంబాల పిల్లలు వస్తున్నారు .సరైన వసతి, పాఠశాల ఏర్పాటు చేయవలసిన దేవాలయం అధికారులు… వీరి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ ప్రతినిధి బృందం గమనించింది.చుట్టూ చెత్తా చెదారంతో.. మురికి నీటితో, దోమలతో జ్వరాలు వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి అసౌకర్యంగా హాస్టల్ ఉన్నది. విద్యార్థులతో సిపిఐ బృందం మాట్లాడగా.. తమకు మంచి వసతి తో కూడిన పాఠశాల భవనం కేటాయించాలని కోరారు. అసలు విద్యను అభ్యసించడానికి వీలు లేకుండా, అసౌకర్యంగా ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఉంది. ఈ దుస్థితిని సిపిఐ బృందం దేవాలయకార్యనిర్వాహణాధికారికి లిఖితపూర్వకంగా వివరిస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది . సంస్కృత పాఠశాల, శిల్ప కళాశాలలను తులసి కాటేజ్ వద్ద ఉన్న గదులను కేటాయించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేసింది . సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ, కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి బాబ్బూరి శ్రీధర్, మండల కార్యదర్శి కళ్లేపల్లి మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి, కార్యవర్గ సభ్యులు పేర బోయిన పెంటయ్య, ఆరె పుష్ప, కోకల రవి, గుండు వెంకటేష్, అనంతుల నరసింహ ,మోనకుంట్ల నరసమ్మ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top