EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పేదల పక్షాన నిలబడుతా పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తా..          బీసీలకు రాజ్యాధికారంలో వాటా సాధించడమే నా లక్ష్యం

హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);బీసీలకు రాజ్యాధికారంలో వాటా సాధించడమే తన జీవిత లక్ష్యం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యలు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆర్. కృష్ణయ్య జన్మదినం పురస్కరించుకొని గుడిసెవాసుల సంఘం ఆద్వర్యం లో బిసి భవన్ లో ఆర్. కృష్ణయ్య ను కలిసి పూల మాల శాలువాతో తో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ మీ అందరిని చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. బీసీల్లో చైతన్యం పెరిగిందని, పేదల పక్షాన నిలబడుతానని, పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. కూలి నాలి చేసుకొని జీవించే పేదలకు నిలువ నీడలేదని అలాంటి వారికి ప్రభుత్వం ఇల్లు కట్టిచాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రం లో గుడిసెవాసుల సంఘం అద్యక్షులు బాకి రవి,ఉపాధ్యక్షులు ములుగు నవీన్,ప్రదాన కార్యదర్శి రమేష్,కార్యదర్శి బాకి సోమయ్య,కోశాధికారి ఉపేందర్,సోమారపు వెంకన్న ,ఆయ్యన్న,కొంగరి విష్ణు, వెంపటి ముత్తయ్య,చిరంజీవి,బి.ఎన్.విజయ లక్ష్మి,పుష్పలత,సోమారం ఐలమ్మ ,రేణుక,ములుగు నీలమ్మ,కుమ్మరి పవన్ కుమార్,ఆర్. కృష్ణ,నాగరాజు, బొళ్లు అనిల్, పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top