EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భిన్నాంశాల సమాహారం ‘ఓ మనిషి! ఓసారి సిగ్గుపడు’ గ్రంధం     పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకనూరు ఇనాక్ 

హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);మానవ సమాజంలోని పోకడలను కవిత్రీకరించిన ‘ఓ మనిషి !ఓసారి సిగ్గుపడు’ గ్రంధంలోని భావాలు మనసుకు ఆకట్టుకునేలా ఉన్నాయని ఆచార్య కొలకనురినాక్ అన్నారు. యువభారతి కవన వేదిక,ఐఐఎంసి కళాశాల సమైక్య నిర్వహణలో సిహెచ్ నటరాజ రావు రచించిన ఓ మనిషి ఒకసారి సిగ్గుపడు కవిత సంపిటి ఆవిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ ఐఐఎంసి కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకనూరు కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటరాజీరావు కవిత్వంలో శైలి శిల్పం సామాజిక స్పృహ పుష్కలంగా ఉన్నాయన్నారు. కవితల్లో సౌందర్య ఆరాధన ప్రకృతి పట్ల ప్రేమ పాఠకులను ఆకట్టుకుంటాయన్నారు అనంతరం గ్రందకర్తను నిర్వహణ సంస్థల పక్షాన ఘనంగా సత్కరించారు. ఇదే సభలో ఆచార్య టీ గౌరీ శంకర్ ప్రసంగం డాక్టర్ సి.నారాయణరెడ్డి విరచిత విశ్వ్వంబరపై దుశ్యరూపకంగా విలసిల్లింది. ఇంకా ఈ సభలో యువభారతి అధ్యక్షుడు వంగపల్లి విశ్వనాథం, కవనవేదిక అధ్యక్షులు చీకోలు సుందరయ్య, కార్యదర్శి రఘు శ్రీ, రంజని అధ్యక్షులు పద్మలత జయరాం ,కవి ఆచార్య పనింద్ర, జీడిగుంట వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు గ్రందకర్త స్పందన ప్రసంగం చేశారు

Related News

Select the Topic
Scroll to Top