EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జిఎస్టి రేట్ల తగ్గింపు తో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ సంస్కరణ

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 16 :జిఎస్టి రేట్లను తగ్గించడం ద్వారా ప్రజలకు, వ్యాపారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ సంస్కరణను తీసుకొచ్చారని బిజెపి జాతీయ అధికారిక ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మేదిఒయా సమావేశం లో మాట్లాడుతూ యుపియే పాలనలో రాష్ట్రాలు, కేంద్రానికి వేర్వేరు రేట్లు ఉండేవి – VAT, Octroi, Entry Tax, ఇతర అనేక పరోక్ష పన్నులు ఉండేవి. ఇవి చాలా గందరగోళాన్ని, సంక్లిష్టతను కలిగించేవి.మోదీ ప్రభుత్వంలోని GST సంస్కరణల ద్వారా అత్యవసర వస్తువులకు 0% పన్ను వర్తించనుంది. 28% జీఎస్టీ పరిధిలో ఉన్న వస్తువులు 18%, 12% వస్తువులు 5% లేదా 0% లోకి తగ్గించబడ్డాయి. దీని ద్వారా మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలుగుతోంది.GST సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం “Ease of Living”ని పెంచడ మన్నారు. ప్రజలకు ఎక్కువ ఆదాయం అందించి వారి రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులను తక్కువ ధరలకు అందించటం.MSMEలు పాత విధానంలో అనేక రేట్లు, సంక్లిష్టత కారణంగా చాలా ఇబ్బందులు పడేవి. ఇప్పుడు 90% రీఫండ్ ఇవ్వడం ద్వారా క్యాష్ ఫ్లో సమస్యలు తొలగిపోయాయి. చాలా సులభంగా, డిజిటల్ రూపంలో చేయొచ్చు.ఇది కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కాదు. ఇది ప్రజల జీవితాన్ని సులభతరం చేసే, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే ప్రజార్హ చర్య.ఈ నిర్ణయం వ్యాపార వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది వినియోగంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తుంది. (GDPలో 57% భాగస్వామ్యం వినియోగం ద్వారా వస్తుంది.)GST సంస్కరణలు ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో చేపట్టిన గొప్ప నిర్ణయం. ఇది 1991లో జరిగిన ఆర్థిక లిబరలైజేషన్ కన్నా చాలా విస్తృత ప్రభావాన్ని చూపుతోంది, ప్రజలందరికీ నేరుగా, స్పష్టంగా లాభాలు కల్పిస్తోంది. స్థానికంగా తయారైన, దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులను వాడాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది, మన వ్యాపారాలను మరింత పటిష్టం చేస్తుంది.మొదటగా, GSTలో రేట్లు సమతుల్యంగా మార్చడం, ఆదాయ పన్ను తగ్గింపు, RBI నిబంధనలు సడలించడం, ఆర్థిక ప్రోత్సాహక చర్యలు చేపట్టడం వంటి నిర్ణయాలు మన ఆర్థిక వ్యవస్థను ప్రేరేపిస్తున్నాయి.అమెరికా అంచనాతో పోల్చితే గత త్రైమాసిక GDP వృద్ధి రేటు 6.5% ఉండగా, వాస్తవం 7.8% వచ్చింది. హై ఫ్రీక్వెన్సీ డేటా ప్రకారం GST రేట్ల సమతుల్యీకరణ వల్ల, దేశంలో అంతర్జాతీయ ఎగుమతులు పెరుగుతున్నాయి.మొత్తం ఆర్థిక పరిస్థితి, మాక్రో స్టెబిలిటీ అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది.ఈ నిర్ణయం కేవలం ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది.ఇది గత 11 సంవత్సరాల్లో చేపట్టిన నిర్మాణాత్మక మరియు విధాన సంస్కరణల ఫలితం.GST సుదీర్ఘ ప్రభావాలను కలిగించే, చరిత్ర సృష్టించే సంస్కరణ. ఇది సెప్టెంబర్ 3న ఆమోదించబడింది.. సెప్టెంబర్ 22న అమలవుతుంది. ఈ సంస్కరణ ప్రజలకు మంచి జీవనం అందిస్తుంది, “Ease of Living” ను ముందుకు తెస్తుంది. వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యాపారాల స్థాయిని పెంపొందిస్తుంది.ప్రధానంగా, ఇది స్వయం ఆధారిత భారత్ నిర్మాణానికి దారి తీస్తుంది – ఇది మన దేశానికి అత్యంత ముఖ్యమైన మార్గదర్శన మన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top