EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నాగార్జునసాగర్ డ్యామ్ జలకళ.. సాగర్‌కు పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్ సెప్టెంబర్ 16 (ఈతరం భారతం);: నాగార్జునసాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తుండటంతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 32,764 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 9,019 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 6,325 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,60,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. కృష్ణమ్మ పరవళ్లు చూసి పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధవనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top