EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మెంటల్లీ డిసేబుల్ పిల్లలకు సౌకర్యాలు ఇంకా మెరుగవ్వాలి     మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం);మెంటల్లీ డిసేబుల్ పిల్లలకు సౌకర్యాలు ఇంకా మెరుగవ్వాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ గారి జన్మదిన సందర్భంగా బోయినపల్లి లో వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసందేర్బంగా ఆతన మాట్లాడుతూ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి రీసెర్చ్ పెరగాలి.ఈ కుటుంబాలు చాలా బాధల్లో ఉంటారు. వారికి నేను ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. వారి సమస్యలు తీర్చడానికి అన్నివిధాలుగా కృషి చేస్తా. దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా బ్రతకడానికి కేంద్రం ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జీనోం యుగంలో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనబడాలి. మెంటల్లి డిజేబుల్డ్ కాకుండా చూసుకోవాలి. ఎర్లీ డిటెక్షన్ వల్ల సమస్యను పరిస్కరించవచ్చునన్నారు..మోడీ ప్రధానమంత్రిగా 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 75 సంవత్సరాల వయసులో కూడా నిరంతరం పనిచేస్తున్నారు. 25 ఏళ్ల యువకుని వలె ఆలోచన చేస్తారు. జ్వరం వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అని ఒక్క రోజు కూడా పడుకోకుండా 365 రోజులు పనిచేస్తున్నారు.మోడీ గారి హయాంలో జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. పళ్ళు అమ్ముకొనేవారు కూడా డిజిటల్ పే మెంట్ చేస్తున్నారు. బిచ్చగాళ్ళ దగ్గర కూడా స్కానర్ కోడ్స్ పెట్టుకుంటున్నారు. మోదీ గారికి జన్మదిన పురస్కరించుకొని జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.ఇలాగే అనేకమంది ముందుకు వచ్చి సేవను అందించాలని కోరుతున్నానన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేజర్ రాజ్ కుమార్, DGM సంజయ్ సింగ్, కొల్లి నాగేశ్వరరావు, భానుక నర్మదా మల్లికార్జున, దీపికా, శేఖర్ యాదవ్, మాణిక్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పిట్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top