ఈతరం భారతం హైదరాబాద్ 18 సెప్టెంబర్ 2025 : తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు గా ప్రముఖ సాహితీవేత్త, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి నియామకం అయిన సందర్భంగా విపంచి ఫౌండేషన్ బృందం హైదరాబాద్ లోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసింది.విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ గ్రామీణ గ్రంథాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ గడ్డం సత్యనారాయణ, జ్యోతిష పరిశోధకులు కూరెళ్ళ నరసింహాచారి,శివ శెట్టి శివప్రసాద్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.















