ఈతరంభారతం ఖమ్మం సెప్టెంబర్ 18 :తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగాకూసుమంచి గ్రామంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే చేగొమ్మ గ్రామంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు రూ.2.75 కోట్ల అంచనా అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన. కేశవాపురం గ్రామంలో రూ.20.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూసుమంచి మండల లబ్ధిదారులు 20మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.















