ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 20.:మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జి హెచ్ ఎం సి డి. సి సుల్తానా మరియు ఇతర అధికారులతో కలిసి ఆర్. కె నగర్ లో ఆకస్మిక పాదయాత్ర చెప్పట్టడం జరిగింది.గత కొన్ని రోజులగా గ్రీన్ వేస్ట్ ( చెట్ల కొమ్మలు వగైరా ) ఎత్తివేత సర్రిగ్గా లేదని, కొన్ని ప్రాంతాల్లో శానిటైజషన్ కూడా దెబ్బ తినడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు.ఈ మేరకు డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారిని పిలిపించి ఆర్. కె నగర్ లో పలు చోట్ల వున్నా పరిస్థితిని చూపించారు.ఈ సందర్బంగా ప్రశ్నించిన డి. సి కు సమాధానం ఇస్తూ తమకు కేటాయించిన వాహనాలు రావట్లేదని అందుకే ఎత్తలేకపోతున్నామని హార్దికల్చర్ రాజు అన్నారు. ఎస్ ఎఫ్ ఏ లను పరస్పర మార్పిడి చెయ్యాలని, ఉన్నంతధికారులతో మాట్లాడి వాహనాలు ఏర్పాటు చెయ్యాలని డి. సి కు శ్రవణ్ సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎస్ ఎఫ్ ఏ గిరి, చెన్నారెడ్డి, బాబీ, నర్సింహా, నాని, భరత్ తదితరులు పాల్గొన్నారు.















