ఈతరంభారతం సెప్టెంబర్ 21 యాదాద్రి భువనగిరి : జిల్లా కేంద్రంలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశానుసారం అమావాస్య అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భువనగిరి పట్టణ వ్యవస్థాపకుడు కుక్కుటపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ కమిటీ సహకారంతో జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ గుప్తా, భువనగిరి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్,డోగిపర్తి ఓం ప్రకాష్ దంపతులు, రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి హాజరయ్యారు. పబ్బా చంద్రశేఖర్, డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనన్న ఆదేశం మేరకు ప్రతినెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైశ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పట్టణ అధ్యక్షులు చీకటిమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి బిజ్జాల శ్రీనివాస్ గుప్తా ,కోశాధికారి జంగాల హనుమంతు, డైరెక్టర్లు కుక్కుటపు అశోక్, అర్థం నవీన్, ఎడవెల్లి విశ్వనాథ్, ఎడవెల్లి ప్రవీణ్,రుక్కయ్య, మహిళా విభాగం సభ్యులు కుక్కుటపు సంధ్య రాణి, చంద్రశేఖర్ కుక్కుటకు సంధ్య అశోక్,ఎడవెల్లి పావని,అర్థం నీలిమ ,బిజ్జాలలలిత పాల్గొన్నారు.















