EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

“ఓజీ’ ఒక్క టికెట్ ధర రూ. 1,29,999 – వేలంలో దక్కించుకున్న పవన్ అభిమాని

ఈతరం భారతం చౌటుప్పల్ సెప్టెంబర్ 21 :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ ఏకంగా 1,29,999 రూపాయలకు వేలంలో అమ్ముడైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంలో పవన్ కల్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్ అత్యధిక ధరకు ఈ టికెట్‌ను దక్కించుకున్నారు.వేలంలో వచ్చిన ఈ మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇస్తామని పరమేష్ ప్రకటించారు. పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

Related News

Select the Topic
Scroll to Top