EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు 

ఈ తరం భారతం  యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 21 : జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆదివారం బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి.

ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలతో తరలివచ్చి ఉయ్యాల పాటలు పాడి ఆటలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మలు ఆడిన అనంతరం నేటి ఆవాసాలలో నిమజ్జనం జరిపి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పలు గ్రామాలలో సాయంత్రం నుండి భారీ వర్షం కురియడంతో బతుకమ్మ వేడుకలకు స్వల్ప అంతరాయం కలిగినా పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top