ఈతరంభారతం సెప్టెంబర్ 21 యాదాద్రి భువనగిరి: జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు లో పోచమ్మ వాడ, క్రాంతి నగర్ లలో వర్షం కురుస్తున్న తడుస్తూనే ఆదివారం రాత్రి మహిళలు బతుకమ్మలు ఆడి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
సాయంత్రం ఆరున్నర గంటల నుండి రాత్రి 9 గంటలు దాటినా కూడా ఏకబిగిన వర్షం కురుస్తుండడం వల్ల బతుకమ్మల ఆటలకు అంతరాయం ఏర్పడింది. మన్నె యూత్ అసోసియేషన్ పోచమ్మ గుడి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకను ఏర్పాటు చేయగా వర్షంలో తడుస్తూనే ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మహిళలు బతుకమ్మలు ఆడారు.
క్రాంతి నగర్ లో మూడు ప్రధాన కూడళ్లలో వర్షం కురుస్తున్నప్పటికీ మహిళలు ఎంతో ఓపికతో బతుకమ్మలు ఆడి నిమజ్జనం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు ముగింపు పలికారు.















