హైదరాబాద్ సెప్టెంబర్ 22 (ఈతరం భారతం);జీఎస్టీ వల్ల దేశానికి ఏదో ఒరగబెట్టినాము, పేద ప్రజలకు న్యాయం చేసినామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వరరావు పేర్కొన్నారు. 2017 లో వన్ నేషన్ వన్ టాక్స్ అని నినాదంతో వచ్చి, ఐదు స్లాబుల ద్వారా బ్రిటిష్ వారు ఏ విధంగానైతే ఉప్పుపై టాక్స్ వేసి ప్రజల నడ్డి విరిచినారు. అదేవిధంగా మోడీ గారు కూడా పేద ప్రజలు వాడే నిత్యవసర వస్తువుల పైన, ఉప్పు పైన కూడా జిఎస్టి టాక్స్ వేసి బ్రిటిష్ వారిని తలదన్నే విధంగా పేద ప్రజలను దగా చేసాడని ఇమర్శించారు. ఈరోజు వస్తువుల పైన ఏడు నుండి 16% వరకు టాక్స్ తగ్గించినారంటే 2017 నుండి 2025 వరకు 8 సంవత్సరాలు పాటు ప్రజలపై భారం మోసి దోపిడీ చేసిందని ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. దానికి నిదర్శన మన్నారు. 2017 లో 90 వేల కోట్ల టాక్స్ వసూలు ఉన్న జీఎస్టీ 2025 సంవత్సరం వచ్చేవరకు లక్ష డెబ్భై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వసూలు చేసినారంటే ఎంత దోపిడీ జరిగిందో ప్రజల ఆలోచించాలన్నారు.ఉంటే సుమారు పది లక్షల కోట్లు పేద మధ్యతరగతి ప్రజల నుండి జీఎస్టీ రూపంలో వసూలు చేసి ప్రజల వెన్నుపూస విరిసినాడు మోడీ కాని ఈరోజు తగ్గించిన టాక్స్ కూడా పేద ప్రజల పైన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు సంవత్సరానికి 48 000 కోట్ల రూపాయలు టాక్స్ తగ్గినట్టు అంచనాలు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది మొత్తం జిహెచ్డీ వసూల్లో సంవత్సరానికి 22 లక్షల కోట్ల రూపాయల లో చాలా చిన్న భాగ మని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ పై ప్రతి సంవత్సరం రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేస్తుంది. ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై వేసిన టాక్స్లు ప్రజల నుండి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల నుండి వసూలు 27 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు జీఎస్టీ టాక్స్ తగ్గడం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి జబ్బలు చేరుచుకుంటున్నారు. ఇది ఒకవేళ ప్రజలకు ఉపయోగపడ్డా సంవత్సరానికి 48 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెప్పే అంచనా. కానీ మోడీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ఈరోజు రష్యా నుండి తెప్పిస్తున్నారని దాంట్లో 40% డిస్కౌంట్ వస్తున్నది ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వకుండా బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా పేద ప్రజలపై టాక్స్ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ పై 27 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన టాక్స్ పై వచ్చిన డబ్బులు ప్రజలకు ఉపయోగపడ్డాయి అంటే మోడీ గారి దృష్టిలో ప్రజలు అంటే కార్పొరేట్ సెక్టర్లు, పెద్ద ఇండస్ట్రీస్ లు , వాళ్లకు మాత్రం 17 లక్షల కోట్ల రూపాయల లోన్లు మాఫీ చేయడం జరిగింది. మిగతా మధ్యతరగతికి ఎంఎస్ఎంఈ లకు పేద ప్రజలు హౌస్ లోన్స్ పైన, వెహికల్స్ లోన్స్ పైన, మిగతా లోన్ల పైన ఒక్క పైసా కూడా తగ్గించకుండా ఇటు పేద, మధ్యతరగతి, ప్రజలని రైతులని ,విద్యార్థులని, మహిళలను ,అందరిపై భారం మోపుతూ గొప్ప ప్రధానమంత్రి దేశంలో పరిపాలిస్తున్నాడని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలు చేసింది ఏమీ లేదు. జీఎస్టీ తీసుకురావడం వల్ల దేశంలో ఫెడరల్ వ్యవస్థను కూడా మోడీ ప్రభుత్వం దెబ్బతీసింది.భారతదేశంలో 2017లో అమలు చేసిన వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థకు గణనీయమైన ప్రభావం చూపింది. ఇది పన్ను విధానాల్లో కేంద్రీకరణను పెంచి, రాష్ట్రాల ఆర్థిక స్వాయత్తాన్ని తగ్గించింది, ఫలితంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో అసమతుల్యత ఏర్పడింది.జీఎస్టీ ముందు, రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్), ఎక్సైజ్ డ్యూటీలు వంటి పరోక్ష పన్నులపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేవి రాజ్యాంగం ఏడవ అనుసూచి లిస్ట్-II ప్రకారం. కానీ జీఎస్టీతో ఈ అధికారాలు కేంద్రీకృతమై, రాష్ట్రాలు స్వతంత్రంగా పన్ను రేట్లు, మినహాయింపులు నిర్ణయించలేకపోతున్నాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక విధానాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడానికి అడ్డంకిగా మారింది.జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతలో నిర్ణయాలు తీసుకుంటుంది, ఇక్కడ కేంద్రానికి 1/3 ఓటు బలం ఉండగా, రాష్ట్రాలకు 2/3. త్రైస్వర్గిక మెజారిటీ అవసరం కారణంగా కేంద్రం, రాష్ట్రాలను ప్రభావితం చేయగలదు. ఇది సహకార ఫెడరలిజాన్ని బలహీనపరచి, కేంద్ర ఆధిపత్యాన్ని పెంచింది.రాష్ట్రాలకు 14% వార్షిక పెరుగుదల హామీతో 5 సంవత్సరాలు భర్తీకరణ ఇచ్చారు, కానీ 2022 తర్వాత ఇది ముగిసిందన్నారు.. కోవిడ్ సమయంలో భర్తీకరణలో ఆలస్యము సుమారు రూ. 2.35 లక్షల కోట్ల నష్టం రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్ర బదిలీలపై మరింత ఆధారపడటం లేదా పెట్రోల్, డీజిల్ వంటి మినహాయింపులపై ఆధారపడటం పెరిగింది, ఇది ధరల అసమానతలకు దారితీస్తోంది.తెలంగాణకు జీఎస్టీ నష్టాల వల్ల జరిగిన అన్యాయం మరియు వెల్ఫేర్ స్కీమ్‌లపై ప్రభావం పడుతుంది.2025లో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కారణంగా తెలంగాణ రాష్ట్రం భారీ ఆదాయ నష్టానికి గురైంది. కేంద్ర ప్రభుత్వం 5%, 12%, 18%, 28% స్లాబ్‌లను 5% 18% మరియు 40%కి మాత్రమే కుదించడం, నిత్యావసరాలు, ఔషధాలు, ఆటోమొబైల్స్, సిమెంట్ వంటి వస్తువులపై పన్ను తగ్గింపులు ఇవ్వడం వల్ల రాష్ట్ర GST వసూళ్లలో 15% పతనం అవుతుంది.ఇది రాష్ట్ర ఆర్థికాలను దెబ్బతీసి, వెల్ఫేర్ స్కీమ్‌లు, ఆరోగ్యం, విద్యా, అభివృద్ధి వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క GST కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించారు.
ఆదాయ నష్టాల వివరాలు
2024-25లో మొత్తం నష్టం: ₹7,000 కోట్ల వరకు. ఇది రాష్ట్ర GST ఆదాయంలో 15%కి సమానం.సగటు పన్ను రేటు పతనం: 14.4% నుండి 9.5%కి తగ్గడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా ₹6,000-10,000 కోట్ల నష్టం అంచనా వేసినారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రతిపక్ష రాష్ట్రాలలో ముఖ్యంగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వెల్ఫేర్ స్కీములో ప్రజలకు చేరకుండా ఉండడానికి ఇది కుట్రలో భాగమే.ఒకవేళ నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల పైన ప్రేమ ఉండి భారం పడకుండా ఉండాలంటే, పెట్రోల్ పై వసూలు చేసే టాక్స్ ల నుండి కార్పొరేట్లకు 17 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే మాఫీ చేసినాడో పెట్రోల్, డీజిల్ ని జిఎస్టి లోకి తీసుకొని రావడము లేదా పెట్రోల్ డీజిల్ పై వచ్చిన టాక్స్ లలో రాష్ట్రాలకు 50 శాతం కేటాయించడం చేస్తే ఆయన దేశభక్తి పైన ప్రజల పైనున్న ప్రేమ తెలియజేస్తుందని విమర్శించారు.















