ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 23 :టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ గా మేడా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు .శివప్రసాద్ మహుబాబాద్ డిపో మేనేజర్ గా పనిచేసి,బదిలీపై ఖమ్మం డిపోకు రావడం జరిగింది .గతంలో ఖమ్మం డిపో మేనేజర్ గా పనిచేసిన దినేశ్ కుమార్ కామారెడ్డి కి వెళ్ళారు .ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా,వారి సహకారంతో ఆర్టీసీ మహాలక్షి లందరికి, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దసరా సందర్భంగా ప్రయాణికులకు సరిపడా బస్సులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.















