హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ఈ తరం భారతం );: మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పొంగిప్రవహిస్తోంది. 30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. మూసీ వరద తాకిడికి శివుడి దేవాలయం మునిగిపోయింది. వరద పొటెత్తడంతో శివాలయం పైనే పూజారి కుటుంబం తలదాచుకుంది. సహాయం కోసం శివాలయం పైకెక్కి పూజారి ఆర్తనాదాలు చేస్తోంది. పురానాపూల్ వద్ద స్మశానవాటిక నీటిలో మునిగిపోయింది. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ లోకి వరద నీరు చేరడంతో జాతిపిత సమాధి మునిగిపోయింది.















