EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చట్టం ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై ముందుకెళ్లాలి : హైకోర్టు

హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ఈ తరంభారతం);చట్టం ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శనివారం విచారించింది. రిజర్వేషన్ల జీవోను కొట్టివేయాలని మాధవరెడ్డి పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై జస్టిస్‌ అభినందన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేసిన మాధవరెడ్డి.. బీసీ రిజర్వేషన్లను 27శాతం నుంచి 42శాతానికి పెంచారని ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60శాతం దాటిందని.. రాజ్యాంగంలో 50శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉందని పిటిషనర్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్‌ చేశారా? అని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇవ్వలేదు. దాంతో గెజిట్‌ చేయకముందే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించిన కోర్టు ప్రశ్నించింది. బీసీల రిజర్వేషన్ల జీవో గెజిట్‌ కాకపోవచ్చని హైకోర్టుకు తెలిపిన ఏజీ సుదర్శన్‌రెడ్డి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మాత్రమే ఉండాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top