యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27: (ఈ తరం భారతం);అంతర్జాతీయ పర్యాటక దినోత్సవములలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ కు తొలి పుణ్యక్షేత్రముగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఎంపిక అయినది .శనివారము సా.గం 6-00లకు సంప్రదాయవేదిక శిల్పారామములో తెలంగాణ ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యనిర్వహణాధికారి జి.రవి, ఐ.ఎ.ఎస్. , ఎఇ ఓ లు జూశెట్టి కృష్ణ , గజవెల్లి రఘు ఈ అవార్డును అందుకొన్నారు.ఇట్టి అవార్డుకు ఈ క్షేత్రమునకు ఎంపిక చేసినందుకు తెలంగాణ టూరిజం శాఖ వారికి ధన్యవాదములు తెలుపుతూ, ఇట్టి అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి.రవి అన్నారు . యావత్ దేవస్థాన సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తపరచారు.















