హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ఈతరం భారతం ); జీఎస్టీ సంస్కరణల వల్ల తెలంగాణ ప్రజలకు 5–6 లక్షల కోట్ల లాభం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. పార్టీ కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల ద్వారా, దసరా – దీపావళి పండుగల సందర్భంగా భారతదేశంలోని 30 కోట్ల కుటుంబాలు ప్రత్యక్ష లబ్ధి పొందాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి మరియు ఉన్నత తరగతి కుటుంబాలకు ₹10,000–₹35,000 వరకు లబ్ధి లభించిందని వివరించారు.తెలంగాణ ప్రజలకు మాత్రమే దాదాపు 5–6 లక్షల కోట్ల లాభం జరిగిందని చెప్పారు.కాంగ్రెస్ నేతలు సొల్లు ప్రచారం చేస్తూ 7,000 కోట్ల నష్టం జరిగిందని భ్రమ కల్పిస్తున్నారని, కానీ వాస్తవానికి తెలంగాణకు 14,000 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. జీఎస్టీలో 50% రాష్ట్రానికి, 50% కేంద్రానికి వస్తుందని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేసినా, ఈరోజు మోడీ తెచ్చిన “సూపర్ జీఎస్టీ” వల్ల ప్రతి ఇంటికి “ఘర్ ఘర్ సురక్ష” లభిస్తోందని అన్నారు.బిఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు అబద్ధమని, 11 సంవత్సరాలుగా మోడీ 11,350 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా అవినీతి రహిత నాయకత్వం చూపారని స్పష్టం చేశారు.కల్వకొట్ట కుటుంబం రాజకీయ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్,మోడీ గారు హానెస్ట్ పాలిటిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు.“మోడీ గారు ఇచ్చిన జీఎస్టీ కానుక దసరా – దీపావళి సందర్భంగా ప్రతి ఇంటికి చేరింది. ప్రజల గుండెల్లో మోడీ గారి నామస్మరణం జరుగుతోంది” అని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.















