EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వరంగల్ ఆడబిడ్డకు జాతీయ స్థాయి జిల్లా అవార్డు

వరంగల్: ఈతరం భారతం సెప్టెంబర్ 28 :వరంగల్ నగరానికి చెందిన ఆడబిడ్డకు ప్రతిష్ఠాత్మక జిల్లా పురస్కారం లభించింది. నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ ఆక్టివిస్ట్(నిఫా) అవార్డు మంగళవారం రాత్రి దిల్లీ లోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో అందుకుంది. హర్యానా స్పీకర్ హరివిందర్ కళ్యాణ్ చోళ్ళేటి నిహారికకు అవార్డు అందజేశారు. గత కొన్నేళ్లుగా సమాజసేవలో నిబద్ధతతో పనిచేసినందుకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఈమె నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్)లో భాగంగా 2024 భారత దేశ రిపబ్లిక్తే సెలబ్రేషన్స్లో కర్తవ్య పథ్ దగ్గర కవాతు చేసి ఎందరో ఆడపిల్ల లకు మనోధైర్యాన్ని నింపింది.నిహారిక దిల్లీలో నిఫా పురస్కారం అందుకుంది .వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసారు.వారి తల్లితండ్రులు మధ్యతరగతి చెందిన వారు కాగా వారి కుమార్తెకు అవార్డు రావడం తో ఆనందం వ్యక్తం చేసారు.

Related News

Select the Topic
Scroll to Top