హైదరాబాద్ సెప్టెంబర్ 29 (ఈతరం భారతం);: ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతీనగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్లు పొన్నం ప్రారంభించారు. జిహెచ్ఎంసి పరిధిలో 12 వేర్వేరు ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా ఇందిరమ్మ కాంటీన్లకు అల్పాహారం, భోజనం అమలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మోతీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. జిహెచ్ఎమ్ సి లో 60 క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇకపై రూ.౫ మిల్లేట్ బ్రేక్ ఫాస్ట్ అని తెలియజేశారు. . రోజూ 30 వేల మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.















