ఈ తరం భారతం సెప్టెంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం: బతుకమ్మ పండుగ రోజు బతుకు పై ఆశ కలిగినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రామన్నగూడెం ఆదివాసి ప్రజలకు తీపి కబురు తెలిపారు. ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూ న్యాయం కోసం ఎదురుచూస్తున్న రామన్నగూడెం ఆదివాసీల కోరిక నెరవేరినట్లయింది. చాపల కాలం నుండి పట్టాలు కలిగి ఉన్న భూములను ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ లో కలుపుకొని వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసీలు సాగు భూమి కోసం పోరాటం చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మూడు సర్వే నెంబర్లలో జాయింట్ సర్వేకు ఆదేశాలిచ్చారు. దీంతో చిన్న పెద్ద ముసలి ముతక దాదాపు 200 మంది ఆదివాసీలు ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న దీక్షను విరమించారు. రామన్నగూడెం గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ :30,36,39 లలో ఉన్న రెవిన్యూ మరియు అటవీ భూముల మధ్య జాయింట్ సర్వే నిర్వహించడం కోసం జిల్లా కలేక్టర్ ఆదేశాలు జారీ చేయటంతో సోమవారం రాత్రి దీక్షను విరమించారు. ఏది ఏమైనా అకౌంటుత దీక్షతో గత ఎనిమిది రోజులుగా దాదాపు 200 మంది రాత్రి పగలు ఎండ వాన తేడా లేకుండా చిన్న పెద్ద ముసలి ముతకతో నిరాహార దీక్ష చేసిన ఆదివాసీల ఐక్యతకు నిదర్శనమే కలెక్టర్ ఆదేశాలు అని చెప్పక తప్పదు.















