ఈతరం భారతం సెప్టెంబర్ 29 యాదాద్రి భువనగిరి: గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి ముగిశాయి. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులపాటు కొనసాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమయ్యాయి.
మహిళలు సద్దుల బతుకమ్మ వేళ గౌరమ్మను ప్రత్యేకంగా పూజించి ఆమెకు భక్తితో ఉయ్యాల పాటలు పాడి ఆటలు ఆడి నీటిలో నిమజ్జనం జరిపి వీడ్కోలు పలికారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం గౌరీ దేవి పాటలు పాడుతూ తమను, తమ కుటుంబాలను చల్లగా దీవించమని ప్రార్థిస్తూ వాయినాల పంపిణీ కార్యక్రమాన్ని మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారు.















