హైదరాబాద్ సెప్టెంబర్ 29 (ఈ తరం భారతం );బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికి అన్యాయం జరగదు..అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవరం గాంధీ భవన్ లో మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.న్యాయ స్థానాలపై గౌరవం ఉంది.. ఎవరు మా నోటి కాడి ముద్ద లాగద్దు అని విజ్ఞప్తి చేశాం,ప్రామాణిక లెక్కల ప్రకారం ప్రజల అభిప్రాయం ప్రకారం ఇది అమలు చేయడం జరిగిందని తెలిపారు.తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణ లో కుల సర్వే నిర్వహించి,డెడికేటెడ్ కమిషన్ , సబ్ కమిటీ వేసి కేబినెట్ లో చర్చించి శాసన సభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తో ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి కి పంపడం జరిగిందని తెలిపారు.రాష్ట్రపతి ఆమోదం తెలపాలని దేశం మొత్తం ఎంపీలతో కలిసి దిల్లీలో కార్యక్రమాలు తీసుకున్నాం..గతంలో ఇందిరా సహాని , కృష్ణమూర్తి కేసు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్రాల చేతిలోనే ఉంటాయి అన్నారు..ఇటీవల తమిళనాడు లో పెండింగ్ లో బిల్లు మూడు నెలలు మించి ఆమోదించకపోతే సుప్రీం కోర్టు ఆమోదించుకున్నట్టే అని తెలిపింది.. దానిని ఆ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి..8 వ తేది కోర్టు వాదనలు వింటామనీ తెలిపిందిఈ కార్యాచరణలో అనేక అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిందిసామాజిక కోణం లో సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై న్యాయ స్థానాల వద్ద సుమోటో గా ఉండేలా మద్దతు ఇవ్వాలన్నారు.రాజకీయ వేదికల్లో బలహీన వర్గాల కు 100 శాతం రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.. శాసన సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు..8 వ తేది నుండి వాద ప్రతివాదనలు ఉంటాయి,ఏకాభ్రీయంగా జరిగిన శాసన సభలో ఆమోదం పొందిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నామని హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలి..కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్, సీపీఎం, సీపీఐ,జనసమితి అన్ని పార్టీలు ,కుల సంఘాలు సామాజిక న్యాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది 42 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ కి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారూ.నేను మంత్రులు కొండా సురేఖ,వాకిటి శ్రీహరి అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం..రాజకీయ భేషజాలు పోము 10ఈడబ్లుఎస్ రిజర్వేషన్లకు ఇచ్చినప్పుడు 50 కాబ్ ఎత్తివేయడం జరిగింది.. అప్పుడే 50 శాతం పరిమితులు దారిపోయాయిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు..మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పై తీసుకున్న దానికి ముందుకు పోతున్నాంమా నోటి కాడి ముద్ద లాగద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం9 వ తేది నుండి నోటిఫికేషన్ రాగానే నామినేషన్ లు స్టార్ట్ అవుతాయిరాజకీయ పార్టీలుగా సామాజిక న్యాయం కలవాలని అడుగుతున్న దానిపై మీ న్యాయవాదుల బృందాన్ని పంపి అఫిడవిట్ లు పంపండితెలంగాణ లో సామాజిక న్యాయం ఆలోచించే వారంతా బలహీన వర్గాల గొంతుకు మద్దతు ఇవ్వాలన్నారు.పక్కన ఉన్న తమిళనాడు లో షెడ్యూల్ 9 లో పొందుపరిచి 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయిసామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్..బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వే కి అంగీకరించిందిరాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది..50 కాబ్ మాట్లాడుతున్న వారు దేశలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు గమనించాలి.. 50 శాతం కాబ్ దాటి రిజర్వేషన్లు ఆయా స్థానిక పరిస్థితులను బట్టి జనాభా ను బట్టి మారుతుందిదేశంలోనే తొలి సామాజిక మార్పు కి శ్రీకారం చుడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నఎంపీటీసీ, జడ్పీటీసీ ,ఎంపీపీ జడ్పిపి, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటింపబడ్డాయిమా సంఘాల తరుపున పిటిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మీరు పిటిషన్ ఉపసంహరించుకోవాలిమేము ఎవరికి వ్యతిరేకం కాదు.. సామాజిక మార్పు కు మేము తీసుకున్న నిర్ణయం కు మద్దతు తెలపండి.రాబోయే కాలంలో సామాజిక న్యాయానికి తొలి ప్రజా ప్రతినిధులు మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు.. తెలంగాణ ప్రభుత్వ పక్షాన ,పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సామాజిక న్యాయానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నబీజేపీ జాతీయ బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ ను బహిరంగంగా అడుగుతున్న బీసీ లకు రిజర్వేషన్లు అమలౌకవడానికి ఇంతకన్నా బెస్ట్ ఏముందో చెప్పు..మీ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు ఆమోదింపజేయాలి మీరు బలహీన వర్గాల గొంతు అయితే మద్దతు తెల్పండిసామాజిక న్యాయం పై రామచంద్ర రావు లాంటి వారు వ్యతిరేకిస్తున్న వారందరూ తెలంగాణ గొంతు ఒకటి కావాలిరిజర్వేషన్లకు వ్యతిరేక భావజాలం పెరగలేదు అంటే రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ లకు మద్దతు తెలపాలి..పాయల్ శంకర్ లాంటి వారు వారి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి రిజర్వేషన్లు ఆమోదం తెలిజేయాలన్నారు.















