హైదరాబాద్ సెప్టెంబర్ 30 (ఈతరం భారతం); అధికారుల నిర్లక్షానికి అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు నరసింహ బలైనపోయారు.దీనిని అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. స్పందించిన అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ బాదితుడు నరసింహ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్దిక సహాయం అందించి బాసటగా నిలిచారు.తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ కు చెందిన నరసింహ (37 ) ఇటీవల ప్రభుత్వ నిర్ణయాల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క కమీషనర్ మరియు డైరెక్టర్(CDMA)సర్కులర్ వలన (ప్రస్తుతం ఉన్న హోర్డింగ్స్ పై టాక్సలు తీసుకోకపోవడం) . ఈ కారణం తో మా సభ్యుడి వద్ద ఉన్న నాలుగు హోర్డింగ్స్ లో ఒకదాన్ని హైడ్రా అధికారులు తొలగించారు. మిగతా హోర్డింగ్స్ కూడా తొలగించబడతాయన్న భయంతో, ఆయనే స్వయంగా మిగతా మూడు హోర్డింగ్స్ ను తొలగించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల వలన ఆయనకు జీవనాధారమైన ఆదాయం పూర్తిగా కోల్పోయి, భూమి యజమానులకు రెంట్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు ఎక్కువై, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి.అతని కుటుంబసభ్యులు తో కొన్ని రోజుల నుంచి నాకు గుండె దడగా ఉంది ఎం అవుతుంది అర్ధం అవట్లేదు అని అతని బాధ చెప్పుకోవటం జరిగింది.ఈ ఒత్తిడితో ఆయనకు రక్తపోటు పెరగడం వల్ల మెదడులో రక్తం గడ్డ కట్టి, 18-09-2025న హయత్ నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో ee నెల 20 న కన్నుమూశారు.ఈ ఘటన ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేరుగా జరిగిన దురదృష్టకర పరిణామంగా నిలిచింది.తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున నరసింహ గారి కుటుంబ సభ్యుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారికి ఆర్థిక సహాయంగా ₹4,00,000/- ఫిక్స్డ్ డిపాజిట్,లక్ష రూపాయల నగదును కుటుంబ సబ్యులకు అందజేశారు. నరసింహకు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.















