EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా  గోల్డ్ మెడల్ అందుకున్న  పల్లె ఇంద్ర కుమార్ గౌడ్ 

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 1 : యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన పల్లె ఇంద్ర కుమార్ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాన్ని ప్రదానం చేసి అభినందించారు. హైదరాబాదులో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 26 వ స్నాతకోత్సవంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఈ బంగారు పతకాన్ని ఇంద్ర కుమార్ గౌడ్ ప్రదానం చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీలో 2022 -2023 విద్యా సంవత్సరంలో లైబ్రరీ సైన్స్ కోర్సు చదివిన ఇంద్ర కుమార్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ వి కె రెడ్డి తో పాటు పలువురు ఇంద్ర కుమార్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మంతపురి గ్రామ మాజీ సర్పంచ్ పల్లె లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్ ల కుమారుడైన ఇంద్ర కుమార్ గౌడ్ ప్రస్తుతం జనగాం జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా విధులను నిర్వహిస్తున్నారు. ఇంద్ర కుమార్ గౌడ్ కు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తో పాటు గోల్డ్ మెడల్ లభించి గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించడం పట్ల స్థానికులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top