హైదరాబాద్ అక్టోబర్ 1 (ఈతరం భారతం);మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణ మొదలు బీసీ రిజర్వేషన్,లు ఇందుకు ఉదాహరణంగా అయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీజేపీ, బీఆర్ ఎస్ లు ఒకటేనని కలిసి సంసారం చేస్తన్నాయని తెలిపారు. అవి రెండు ఒకటై కుట్ర పూరితంగా కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బాకీ కార్డు అంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని, వారి హయాంలో చేసిన అప్పులకు తాము మిత్తిలు కడుతున్నామని పేర్కొన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ ఎస్ నాయకులు బకాయి అనే పదం ఎత్తే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల కలలు సాకారం, సబ్సిడీ తో గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంచడం, రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్, రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, వంటి సంక్షేమ కార్యక్రమాలు పజలకు అందించడం బాకీ పడ్డట్టా అని అయన ప్రశ్నించారు. కాళేశ్వరం, ఈ కార్ రేస్, స్కాంలో దొరకడంతో బీఆర్ఎస్ నాయకులకు దిక్కుతోచక బకాయి కార్డు పేరుతొ మోసపూరిత ప్రచారం చేస్తున్నారని అయన ఆరోపించారు. ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తుందని విమర్శించారు. ప్రజల మనస్సులో కాంగ్రెస్ ఉందని, స్థానిక ఎన్నికల్లో 80%శాతంకు పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే దీమాను అయన వ్యక్తం చేశారు. హైడ్రా పై అపోహలు వద్దని పేర్కొన్న అయన హైడ్రాను అభినందించారు.















