EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి

ఈతరం భారతం/ నిజామాబాద్/ అక్టోబర్ 12 :రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్  మధుశ్రీ నలుబోల.

దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలని దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించగలరని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఎవ్వరయిన సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు – 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి అని వివరించారు.

టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.

ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు

జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు.

తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పూర్తివివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఎ.సి.పి  కార్యాలయంలో

ఇవ్వాలి.

Related News

Select the Topic
Scroll to Top