EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 15 మంగళ వారం

____________________________________________

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాయకులు డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, మాట్లాడుతూ.. చర్చల పేరుతో ఆటో యూనియన్‌ నాయకులను మోసం చేయడం మానుకుని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఆటో సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నే రవికుమార్, ఉపాధ్యక్షుడు ఎస్‌.కె. దస్తగిరి(చోటు) హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు ఐబీ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జబ్బార్, రాష్ట్ర కార్యదర్శి సాయిలు,అక్రమ్, ఫిరోజ్, పోతుల కుమార్ ఉమర్ ఖాన్,బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top