హైదరాబాద్ అక్టోబర్ 13 (ఈతరం భారతం);సీనియర్ జర్నలిస్టు,జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ ఎన్ఎస్) మేనేజింగ్ డైరెక్టర్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణం జర్నలిస్ట్ లోకానికిం తీరని లోటని ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ డా. మహేశుని లక్ష్మయ్య నేత పేర్కొన్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ ఎన్ఎస్) ను స్థాపించి నికార్సయిన జర్నలిజానికి నాంది పలుకారన్నారు.ఆయన స్తాపించిన ఎన్ఎన్ఎస్ సంస్థ ద్వార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందరో యువకులను జర్నలిస్టులుగా తీర్చి దిద్ది సమాజానికి అందించిన మహాను బావుడని కొనియాడారు. తనవద్ద పని చేసే సిబ్బందిని కుటుంబ సబ్యులుగా బావించి చేరదీసే గొప్ప మనస్త్వం ఆయన దన్నారు.1983లో కొండా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జర్నలిజంపై ఉన్న మక్కువతో 1980 దశకంలో న్యూస్ సర్వీస్ సిండికేట్ మీడియా సంస్థను ప్రారంభించి మీడియా రంగానికి సేవలందించారు.















